బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు సాధారణంగా వడ్డీని సంవత్సరానికి ఎంత శాతం (% per annum) అనే పద్ధతిలో చెబుతాయి. అయితే మన దగ్గర అప్పులు ఇచ్చేటప్పుడు లేదా తీసుకునేటప్పుడు మాత్రం “రూపాయి వడ్డీ”, “ఒకటిన్నర రూపాయి వడ్డీ”, “రెండు రూపాయల వడ్డీ” అని నెలవారీ వడ్డీ రేటును చెబుతుంటారు.

ఈ రెండు పద్ధతుల మధ్య తేడా తెలియకపోతే వడ్డీ ఎంత పడుతుందో అర్థం చేసుకోవడం కాస్త కష్టంగా ఉంటుంది. అందుకే నెలవారీ వడ్డీని సంవత్సరానికి శాతంగా మార్చి లెక్కిస్తే, బ్యాంకు వడ్డీతోనూ ఇతర అప్పుల వడ్డీతోనూ సులభంగా పోల్చుకోవచ్చు.

సులువైన సూత్రం

సంవత్సర శాతం = నెలవారీ రూపాయలు × 12 (బారు వడ్డీలో)

ఉదాహరణకు రెండు రూపాయల వడ్డీ అంటే నెలకు 2%, కాబట్టి 2 × 12 = 24% సంవత్సరానికి.

నెలవారీ రేటుసంవత్సరానికి (బారు)చక్ర వడ్డీలో వాస్తవ రేటు
1 రూపాయి12%సుమారు 12.68%
1.5 రూపాయలు18%సుమారు 19.56%
2 రూపాయలు24%సుమారు 26.82%
3 రూపాయలు36%సుమారు 42.58%
5 రూపాయలు60%సుమారు 79.59%

సంవత్సర శాతాన్ని నెలవారీగా మార్చడం

రివర్స్‌లో, బ్యాంక్ 18% అంటే నెలకు 18 ÷ 12 = 1.5 రూపాయల వడ్డీ అన్నమాట.

ఎందుకు ముఖ్యం?

నెలకు రెండు రూపాయల వడ్డీనే కదా!” అని తేలికగా తీసుకోవచ్చు. కానీ ఈ వడ్డీని సంవత్సరానికి లెక్కిస్తే 24% అవుతుంది. వడ్డీని ప్రతి నెలా అసలుకు కలిపి, దానిపై మళ్లీ వడ్డీ లెక్కిస్తే చక్రవడ్డీ విధానంలో వార్షిక ప్రభావిత వడ్డీ సుమారు 26.82% అవుతుంది.

అందుకే అప్పు తీసుకునే ముందు నెలవారీ వడ్డీ ఎంత ఉందో మాత్రమే చూడకుండా, దాన్ని సంవత్సరానికి ఎంత శాతం అవుతుందో లెక్కించాలి. ఆ తర్వాత బ్యాంకులు, సహకార సంఘాలు, స్వయం సహాయక సంఘాలు (SHG) అందించే రుణాల వడ్డీ రేట్లతో పోల్చుకోవాలి. అలాగే ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఛార్జీలు, తిరిగి చెల్లించే విధానాన్ని కూడా పరిశీలిస్తే, మీకు సరిపోయే రుణాన్ని ఎంచుకోవడం సులభమవుతుంది.

మీరు తీసుకున్న అప్పుకు నెలకు ఎంత వడ్డీ పడుతుంది, సంవత్సరానికి మొత్తం ఎంత చెల్లించాలి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ అప్పు వివరాలను నమోదు చేసి, వడ్డీని సులభంగా లెక్కించడానికి మా వడ్డీ వడ్డీ కాలిక్యులేటర్ ఉపయోగించండి. అప్పు తీసుకునే ముందు వడ్డీ భారాన్ని అర్థం చేసుకుని నిర్ణయం తీసుకోండి.